🛕 Kolleru Lake Peddintlamma Temple
కొల్లేరు సరస్సు పెద్దింట్లమ్మ వారి ఆలయం – Vadiyarajulu (Vaddera Rajulu) Heritage
Kolleru Lake Peddintlamma Temple – History of Vadiyarajulu (Vaddera Rajulu) | కొల్లేటికోట వడియరాజులు నిర్మించిన ఆలయం
Explore the historic Peddintlamma Temple at Kolleru Lake, built by Vadiyarajulu (Vaddera Rajulu). Learn about its history, festivals, and significance as the clan deity of Vaddera community.
Introduction | పరిచయం
Kolleru Lake is one of the largest freshwater lakes in India, located between Krishna and West Godavari districts, Andhra Pradesh. Often called the Kashmir of the South, it is not only a paradise for birds but also a place of great spiritual heritage. At its heart lies Kollletikota, home to the ancient Peddintlamma Temple, revered as the Kula Daivam (clan deity) of the Vadiyarajulu / Vaddera Rajulu.
ఆంధ్రప్రదేశ్‌లోని సహజసిద్ధమైన అందాలలో ఒకటి కొల్లేరు సరస్సు. దక్షిణ కాశ్మీరంగా ప్రసిద్ధి పొందిన ఈ సరస్సు మధ్యలోని కొల్లేటికోటలో వెలసి ఉన్నది పెద్దింట్లమ్మ వారి ఆలయం. ఈ అమ్మవారిని స్థానిక వడియరాజులు (వడ్డెర రాజులు) తమ కులదైవంగా కొలుస్తారు.
Peddintlamma – The Goddess of Vadiyarajulu | వడియరాజుల కులదేవత పెద్దింట్లమ్మ
-
The idol of Peddintlamma is 9 feet tall, seated in Padmasana posture, with divine wide eyes.
-
Devotees call her Maha Shakti, Perantallamma, symbolizing strength and protection.
-
Every year, from Phalguna Shuddha Padyami to Pournami, month-long festivals are held. On Dwadasi, the divine wedding of Peddintlamma with Gokarneswara Swamy is celebrated.
శతాబ్దాల నాటి ఈ ఆలయంలో తొమ్మిది అడుగుల ఎత్తు కలిగిన అమ్మవారు భక్తులకు మహాశక్తి ప్రతిరూపంగా నిలుస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజు అమ్మవారి కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతుంది.
Kollletikota Fort – Built by Vadiyarajulu | వడియరాజులు కట్టించిన కొల్లేటికోట దుర్గం
-
The fort at Kollletikota was built by Langulya Gajapati Raju (1237–1282), a Surya Vamsa king of the Vadiyarajulu lineage.
-
British historian Robert Sewell recorded that today only earthen mounds remain.
-
In the 15th century, Odisha ruler Ambadeva Raya conquered the fort by diverting lake waters through Upputeru stream.
-
Folklore recalls that a general sacrificed his daughter, and that place is still called Perantalla Kanama.
కొల్లేటికోట దుర్గాన్ని లంగుల్య గజపతి రాజు కట్టించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు, నీటిని మళ్లించి దాడులు చేయడం, బలి కథనం—all reflect the turbulent history.
Vadiyarajulu (Vaddera Rajulu) – From Odisha to Kolleru | ఒడిశా నుండి కొల్లేరు వరకు వడియరాజులు
-
Vadiyarajulu are descendants of the Surya Vamsa rulers of Odisha.
-
Originally called Odiyarajulu, over time became Vaddera / Vaddi.
-
Their Kula Daivam (clan goddess) is none other than Peddintlamma.
-
Even today, Vaddera families around Kolleru begin marriages, festivals, and new ventures only after seeking blessings from Peddintlamma.
ఒడిశాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వీరు మొదట ఒడియరాజులుగా పిలువబడ్డారు. నేటి వడ్డెర రాజులు తమ కులదైవంగా పెద్దింట్లమ్మనే ఆరాధిస్తున్నారు.
Kolleru Lake – A Natural & Spiritual Wonder | సహజ & ఆధ్యాత్మిక అద్భుతం
-
Spread: 250–340 sq. km, depth 0.5–2 meters.
-
145 villages: 105 in West Godavari, 40 in Krishna district.
-
Home to migratory birds from as far as Siberia.
-
Devotees reach the temple by boats or through Peddintlamma Varadhi (wooden bridge).
కొల్లేరు సరస్సు ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, పెద్దింట్లమ్మ ఆలయం కారణంగా ఆధ్యాత్మిక శక్తికి కూడా ప్రతీక.
References | ఆధారాలు
-
📖 Robert Sewell – Historical Records of Vijayanagar (1884)
🔗 Archive.org -
📖 Madala Panji (Jagannath Temple, Odisha) – Surya Vamsa lineage
🔗 JSTOR Reference -
📰 Local Coverage – Eenadu, Sakshi (Peddintlamma Jatara)
Conclusion | ముగింపు
The Peddintlamma Temple of Kollletikota stands as a living symbol of Vadiyarajulu (Vaddera Rajulu) heritage. It connects the glorious past of Surya Vamsa rulers of Odisha with the present faith of thousands of devotees around Kolleru Lake.
ఈ ఆలయం వడియరాజుల గర్వకారణం. భక్తి, చరిత్ర, సంస్కృతి—all meet here in the waters of Kolleru. 🚩
కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము.
రాష్ట్రంలో అతి పెద్ద సహజ సిద్దమైన మంచి నీటి సరస్సు కొల్లేరు. ఇది కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉంది. దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో కొల్లేటికోట ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పెద్దింట్లమ్మను స్థానిక #వడియ_రాజులు తమ కుల దైవంగా కొలుస్తారు. ఈ ఆలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం కూడా ఉంది.శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగుల ఎత్తు కలిగిన విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉన్న పెద్దింట్లమ్మ పార్వతీదేవి ప్రతి రూపం మహిమ గల అమ్మగా, పెద్దమ్మగా భక్తులు భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడుల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన గల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.
చారిత్రక సమాచారం:
కొల్లేటి కోట వద్ద గజపతుల కోట ఉండేది. కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవంశం వడియ రాజు లాంగుల్య గజపతి రాజు (1237 - 1282) కట్టించాడని చెప్పబడుతున్నది. ప్రస్తుతం ఆ స్థానంలో ఒక మట్టి దిబ్బ తప్ప కోట అవశేషాలు ఏవీ లేవని చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్ నమోదు చేశాడు.ఇక్కడి జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉంది. కొల్లేటికోట గ్రామాన్ని, 15వ శతాబ్దపు చివరి భాగంలో ఒడిషాను పాలించిన అంబదేవరాయ (1462-82) జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గజపతులపై దండెత్తి వచ్చిన శత్రువులు (మహమ్మదీయ సుల్తానులు) కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక ఉప్పుటేరు అనే కాలువ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి, నీటి మట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడిచేసి కొల్లేటికోటను వశం చేసుకున్నారని ప్రతీతి. ఆ దాడి సఫలం కావటానికి ఒడిశా సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ను బలి ఇచ్చాడని. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ళ కనమ అని పేరు నిలిచిపోయిందని కథనం. అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సూర్యవంశం వడియ రాజులు (నేటి వడ్డిలు,వడ్డెర కులస్తులు) కొల్లేటి కోట పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు.
https://www.temptimings.com/kolletikota-peddintlamma-temple-at-kolleru/
https://holyshrines.in/peddintlamma-temple-kolletikota/
https://mysouthindia.com/sri-peddintlamma-temple-andhra-pradesh.html
https://www.facebook.com/share/p/1742MFSvKf/
కొల్లేటి కోటలోని 11వ శతాబ్దం నాటి అమ్మవారి దేవాలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం ఉంది. ఒడిషా పాలకుడు అంబదేవరాయ ఈ దుర్గాన్ని జయించి జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం.అగస్త్యుడు సముద్రజలాన్ని ఇంకించినట్టు, కొల్లేరు నీరు ఇంకించి, తోడించి, వంతెన వేయించి, కొల్లేరు మధ్యలో దుర్గాన్ని నిర్మించారట.. అయితే ఒరిస్సా లోని పూరి జగన్నాద ఆలయంలో లంగుల్య గజపతి రాజు ముని ముత్తాత తాము సూర్యవంశస్థులు అని మరియు గంగేయ వారసులు అని మాడల పంజి శిలాశాసనంలో వ్రాయించాడు. కాగా నేడు కొల్లేటి సరస్సు పరీవాహక ప్రాంతాలలో నివసించే వడ్డీలు కథనాల మరియు అనేక పత్రికా కథనాల ప్రకారం వీరంతా సూర్యవంశానికి చెందిన వారని మరియు లంగుల్య గజపతి రాజు పరిపాలనలో ఇక్కడికి ఒరిస్సా నుండి వలస వచ్చారని అర్దమవుతుంది. పూర్వం వీరిని ఒడిశా నుండి వచ్చిన క్షత్రియులు కావడంతో ఒడియారాజులుగా (వడియరాజుల) పిలువబడేవారు ప్రస్తుతం వడ్డీలుగా,వడ్డెర గా పిలవబడుతున్నారు. వీరి కుల దైవం పేరంటాలమ్మ నేడు పెద్దింట్లమ్మగా పిలువబడుతుంది..
కొల్లేరు లంక గ్రామాల ప్రజలు అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇక్కడ నివాసం ఉంటున్న వడియరాజుల కులస్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెడతారు. ప్రతి యేడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున అమ్మవారి జాతర (ఉత్సవాల)ను నెలరోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొల్లేరులో పడవ ప్రయాణం, కర్రల వంతెన (పెద్దింట్లమ్మ వారధి) పై ప్రయాణం ఉంటుంది. 135 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 105 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని 7 మండలాల్లో ఉండగా, మిగిలిన 40 గ్రామాలు కృష్ణాజిల్లాలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి.. ఈ గ్రామాలలో ఎక్కువగా వడియరాజులు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. వీరికి ఏదైనా సమస్యలు వస్తే వీరికి వీరే పెద్దలతో మాట్లాడుకొని తీర్పు చెప్పించుకొని సమస్యని తీర్చుకుంటారు.
కొల్లేటి సరస్సు:
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. జై మాత 🚩🙏🙏🙏
https://alchetron.com/Kolletikota
https://www.templetimings.com/kolletikota-peddintlamma-temple-at-kolleru/
https://holyshrines.in/peddintlamma-temple-kolletikota/
https://mysouthindia.com/sri-peddintlamma-temple-andhra-pradesh.html
https://www.facebook.com/share/p/1742MFSvKf/
No comments:
Post a Comment